Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తూ చీజ్ బడీ హై ‘మస్క్ మస్క్’ అంటూ పాట ఎత్తుకున్న అమితాబ్

Amitabh Bachchan sings song for Elon Musk
Advertisement
  • సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించని ఖాతాలకు ‘బ్లూటిక్’ను తొలగించిన ట్విట్టర్
  • తాను డబ్బు చెల్లించానని ట్వీట్ చేసిన అమితాబ్ 
  • ఈ రోజు బ్లూటిక్ ను పునరుద్ధరించిన ట్విట్టర్.. వెరైటీగా థ్యాంక్స్ చెప్పిన బాలీవుడ్ మెగాస్టార్
Advertisement
సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించని ఖాతాలకు ‘బ్లూటిక్’ను ట్విట్టర్ నిన్న తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఓ వైపు ట్విట్టర్ తీరుపై విమర్శలు రాగా.. మరోవైపు విపరీతమైన ట్రోల్స్, మేమ్స్ పోటెత్తాయి.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతాకు కూడా బ్లూటిక్ పోయింది. దీంతో బ్లూటిక్ స్థానంలో జాతీయ జెండాను తన పేరు ముందు అమితాబ్ పెట్టారు. తాను డబ్బు చెల్లించాలని, బ్లూటిక్ ను పునరుద్ధరించాలంటూ ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. ఈ మేరకు ఆయన అవధీ (ప్రయాగ్ రాజ్ లో మాట్లాడే భాష) లో ఫన్నీగా రాసుకొచ్చారు.

‘‘హే ట్విట్టర్! వింటున్నావా? నేను సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ కోసం డబ్బు చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందు నీలి కమలాన్ని (బ్లూ లోటస్) తిరిగి ఉంచండి. తద్వారా నేను అమితాబ్ బచ్చన్ ని అని ప్రజలు తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. మీ కాళ్ల మీద కూడా పడాలా?’’ అని ట్వీట్‌ చేశారు.

తర్వాత అమితాబ్ ఖాతాకు బ్లూటిక్ ను ట్విట్టర్ పునరుద్ధరించింది. దీంతో శనివారం తెల్లవారకముందే ఆయన స్పందించారు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కు థ్యాంక్స్ చెబుతూ.. అర్ధరాత్రి 1.10 సమయంలో ట్వీట్ చేశారు.

 ‘‘ఓయ్ మస్క్ అన్నా.. మీకు చాలా చాలా థ్యాంక్స్. నా పేరు ఎదుట.. ఆ బ్లూటిక్ యాడ్ అయింది’’ అని రాసుకొచ్చారు. ‘‘ఇంకేం చెప్పమంటావు అన్న.. నాకు పాట పాడాలని ఉంది. మీకు వినాలని ఉందా? అయితే వినండి. తూ చీజ్ బడీ మై మస్క్ మస్క్.. తూ చీజ్ బడీ హై మస్క్’’ అని అమితాబ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది. 

‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ అనే పాట 1994లో విడుదలైన ‘మొహ్రా’ సినిమాలోనిది. ఆ పాటలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కనిపిస్తారు. రాజీవ్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్ శెట్టి, నసీరుద్దీన్ షా, గుల్షాన్ గ్రోవర్, పరేశ్ రావల్ తదితరులు నటించారు.
Advertisement
Advertisement
Amitabh Bachchan
blue tick
Elon Musk
Twitter

More Telugu News